HomeTelugu Trending‘స్టూవర్ట్‌పురం దొంగ’గా మారిన బెల్లంకొండ శ్రీనివాస్‌

‘స్టూవర్ట్‌పురం దొంగ’గా మారిన బెల్లంకొండ శ్రీనివాస్‌

Bellamkonda sreenivas new m
టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌.. కె.ఎస్‌. కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాకి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే పేరుని ఫిక్స్‌ చేశారు. బయోపిక్ ఆఫ్‌ టైగర్‌ అనేది ఉపశీర్షిక. స్టూవర్ట్‌పురం చోరీల నేపథ్యంలో సాగే కథ ఇది.

1970నాటి పరిస్థితుల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అనే విషయం ప్రకటించలేదు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ (హిందీ రీమేక్‌)తో బిజీగా ఉన్నాడు‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu