HomeTelugu Trending'భగవంత్ కేసరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌

‘భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌

Bhagavanth kesari movie tra

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఎన్‌బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టీజ‌ర్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీలో నిర్వహించనున్నట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు వాల్తేరు వీరయ్య ఫేమ్ K. S. రవీంద్ర (అలియాస్ బాబీ కొల్లి), వీర సింహా రెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేని లు స్పెషల్ గెస్ట్‌లుగా వ‌స్తున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్‌ను రాత్రి 8:16 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా పెళ్లి సందడి ఫేం శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు అర్జున్‌ రాంపాల్‌తో పాటు తదితరులు నటిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu