HomeTelugu Trendingవిడుదలకు ముందే రికార్డు క్రియేట్‌ చేసిన 'భగవంత్‌ కేసరి'

విడుదలకు ముందే రికార్డు క్రియేట్‌ చేసిన ‘భగవంత్‌ కేసరి’

Bhagavanth kesari worldwide

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య న్యూ లుక్ కనిపించనున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తన మార్కు కామెడీకి తోడు యాక్షన్ కూడా జోడించి అనిల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి విజయాల తర్వాత బాలయ్య ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా దసరా సందర్భంగా.. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ కు చాలా సమయం ఉండగానే ఈ సినిమా థియెట్రికల్ రైట్స్‌ అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్‌‌లోనే అత్యధికంగా రూ. 75 కోట్లకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌ ను విక్రయించినట్టు టాలీవుడ్‌ సమాచారం.

బాలకృష్ణ గత చిత్రం వీరసింహారెడ్డి రైట్స్ అత్యధికంగా రూ.73 కోట్లకు అమ్ముడవగా ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్‌ అయింది. కాగా, ఈ చిత్రం అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 18న యూఎస్‌ లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu