HomeTelugu Big Storiesఆచార్య: 'భలే భలే బంజారా' ఫుల్ సాంగ్ వచ్చేసింది

ఆచార్య: ‘భలే భలే బంజారా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

Bhale Bhale Banjara Full Video Song Acharya
మెగాస్టార్‌ చిరంజీవి – చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలైంది. నిరంజన్ రెడ్డి – అన్వేశ్ రెడ్డి నిర్మించారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఆయన కట్టిన బాణీలకు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘భలే భలే బంజారా’ పూర్తి పాటను రిలీజ్ చేశారు. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య – సిద్ధ .. బృందంపై, రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, శంకర్ మహదేవన్ – రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్.

చిరంజీవితో పోటీ పడి చరణ్ స్టెప్స్ వేయడం ఈ పాటలో కనిపిస్తుంది. మణిశర్మ అందించిన అద్భుతమైన మాస్ బీట్స్ లో ఇది ఒకటి. అటవీ ప్రాంతంలోని ఒక కోయగూడెంలో .. ఓ వెన్నెల రాత్రిలో నక్సలైట్స్ సరదాగా ఆడిపాడితే ఎలా ఉంటుందనేది బాగా అర్థం చేసుకుని మణిశర్మ ఈ బీట్ అందించిన విషయం తెలిసిపోతూనే ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu