HomeTelugu Big Storiesఆచార్య: 'భలే భలే బంజారా' పాట విడుదల

ఆచార్య: ‘భలే భలే బంజారా’ పాట విడుదల

Bhale Bhale Banjara Lyrical
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా నుంచి ‘భలే భలే బంజారా’ పాట విడుదలైంది. ఈ పాటలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ స్టెప్పులేయడంతో కొన్నిరోజులుగా ఈ పాట ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అభిమానులకు కనువిందు చేసే ఈ పాటను చిత్రబృందం ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. “సిరుతా పులుల సిందాటా… సరదా పులుల సయ్యాటా” అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.

ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu