HomeTelugu Big Stories'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

Bheemla nayak pre release e

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 8 గంటలకు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా చెప్పడంతో మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరికీ షాకిస్తూ తాజాగా ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

‘ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన మృతికి గౌరవ సూచకంగా #Bheemlanayak ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు’ అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. తరువాతైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ట్రైలర్ సంగతేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu