HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌కు జంటగా శ్రీలంక బ్యూటీ!

పవన్‌ కళ్యాణ్‌కు జంటగా శ్రీలంక బ్యూటీ!

Jacqueline Fernandez in Paw
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ కాంబినేషన్‌లో ఓ పీరియాడికల్‌ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గాతీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె యువరాణి పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్‌ వజ్రాల దొంగగా కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం.

తాజా రెండో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఫైనల్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ శ్రీలంక ఈ బ్యూటీ జూనియర్‌ఎన్టీఆర్‌ ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో చిందులేసింది. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఆడిపాడి అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu