HomeTelugu Big Stories'మార్చి 1న' భోళా శంకర్‌ ఫస్ట్‌లుక్‌..

‘మార్చి 1న’ భోళా శంకర్‌ ఫస్ట్‌లుక్‌..

bhola shankr

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’​. మెహర్​ రమేష్​ డైరెక్షన్‌లో వస్తోన్న మాస్సివ్ యాక్షన్​ థ్రిల్లర్​​ మూవీ తమిళ స్టార్​ హీరో అజిత్​ నటించిన సూపర్​ హిట్​ చిత్రం ‘వేదాళం’ సినిమాకు రీమెక్​గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి 155వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​, క్రియేటివ్​ కమర్షియల్స్​ బ్యానర్స్​పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్​గా చేస్తున్న ‘భోళా శంకర్’​ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్​ నటిస్తోంది.

ఇదివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్​కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ శివరాత్రికి మెగా అభిమానులకు చిత్రబృందం కానుక ఇవ్వనుంది. ఈ సినిమా ఫస్ట్​ లుక్​ను మార్చి 1న ఉదయం 9:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. శివుడికి మరొక పేరు అయిన శంకర్​ టైటిల్​ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున ఫస్ట్​ లుక్​ను విడుదల​ చేసేందుకు ఇదే మంచి సమయమని మేకర్స్​ భావించినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu