HomeTelugu Big Storiesతాత పాటకు స్టెప్స్‌ వేసిన గల్లా అశోక్‌.. సాంగ్‌ ప్రొమో అదుర్స్‌..

తాత పాటకు స్టెప్స్‌ వేసిన గల్లా అశోక్‌.. సాంగ్‌ ప్రొమో అదుర్స్‌..

6 29
టాలీవుడ్‌ ప్రేక్షకులను సూపర్‌ స్టార్‌ కృష్ణ ‘జుంబారే..జుజుంబరే’ పాటతో ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘యమలీల’ సినిమాలోని ఈ పాటకు కృష్ణ వేసిన స్టెప్స్‌ అప్పట్లో సంచలనం సృష్టంచాయి. ఇప్పటికీ ఈ పాటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిసయోక్తి కాదు. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడగా.. జొన్నవిత్తుల సాహిత్యం అందించాడు. ఇప్పుడు ఈ పాటను తన సినిమా కోసం వాడుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈయన ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘జుంబారే జుజుంబరే’ పాట ప్రొమోను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో అచ్చం కృష్ణలా అశోక్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సాంగ్‌ ప్రొమోకు మంచి స్పందన వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu