HomeTelugu Trendingవిడాకులపై క్లారిటీ ఇచ్చిన భూమిక చావ్లా

విడాకులపై క్లారిటీ ఇచ్చిన భూమిక చావ్లా

bhumika chawla
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి భూమిక చావ్లా వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. 2007లో యోగా టీచర్ భరత్‌ను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో వీరికి ఒక బాబు పుట్టాడు. సోషల్ మీడియాలో భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేయడం లేదని, భూమిక తన భర్తతో విడాకులు తీసుకుందంటూ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ పుకార్లకు చెక్ పెట్టింది నటి భూమిక. ఇటీవల తన పెళ్లిరోజు సందర్భంగా భర్త భరత్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ రూమర్లకు అడ్డుకట్ట వేసింది.

యువకుడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భూమిక ఆ తర్వాత ఖుషీ, వాసు, ఒక్కడు, సింహాద్రి వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా ఎంసీఏ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత సవ్యసాచి, రూలర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గోపీచంద్ మూవీ సిటీమార్‌లో నటిస్తోంది. “వెయ్యి మైళ్ల ప్ర‌యాణ‌మైనా ఒక్క అడుగుతోనే మొద‌లవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.., ఒక‌రి గురించి ఒక‌రం మ‌రింత లోతుగా అర్థం చేసుకోవ‌డమే. మన గురించి మ‌నం ఇంకా తెలుసుకోవ‌డ‌మే. మ‌న‌ల్ని, మ‌న జంట ప్ర‌యాణాన్ని ఆ దేవుడు ఆశీర్వ‌దించాలి. నిన్ను, నీ అంకిత‌భావాన్ని, క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్ని చూస్తుంటే నాకు గ‌ర్వంగా ఉంది” అంటూ తన భర్తకు హ్యాపీ యానివర్సరీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu