HomeTelugu Trendingబిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా మృతి

బిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా మృతి

sidharth shukla passed away

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విన్నర్‌, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపుల‌ర్ అయ్యారు. హింప్టీ శ‌ర్మా కే దుల్హ‌నియా చిత్రంలో ఆయ‌న న‌టించారు. ఇవాళ ఉద‌యం శుక్లాకు భారీ గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సిద్ధార్థ శుక్లా మ‌ర‌ణించిన‌ట్లు కూప‌ర్ హాస్పిట‌ల్ ద్రువీక‌రించింది.

ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే 3 లాంటి షోల్లో క‌నిపించాడు. బాలికా వ‌ధు, దిల్ సే దిల్ త‌క్ టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టించారు. జ‌ల‌క్ దిక్లాజా 6, ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్‌-ఖ‌త్నోంకా ఖిలాడి లాంటి రియాల్టీ షోల్లోనూ న‌టించారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సురిచితమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu