HomeTelugu Trendingరాహుల్‌ సిప్లిగంజ్‌కు జంపర్‌ ఆఫర్‌ సూపర్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌!

రాహుల్‌ సిప్లిగంజ్‌కు జంపర్‌ ఆఫర్‌ సూపర్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌!

4 7
టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -3 విన్నర్‌గా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ యంగ్‌ సింగర్‌ క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’లో ఓ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఈచిత్రంలో రాజశేఖర్ కూతురు శివాత్మకకూ.. జోడిగా నటిస్తున్నాడు. కట్ చేస్తే.. రాహుల్ సిప్లిగంజ్‌కు మరో అరుదైన అవకాశం వచ్చింది.

ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్‌ యాక్ట్ చేస్తోన్న సినిమాలో కీలక పాత్ర చేయనున్నట్టు సమాచారం. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈచిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్.. రజీనీకాంత్‌తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ చిత్రంలో రాహుల్ ఎలాంటి పాత్ర చేయబోతున్నడనేది చూడాలి. మొత్తనికి బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu