HomeTelugu Trendingబిగ్‌బాస్‌: మోనాల్‌ డ్రెస్‌.. నాగ్‌ సలహా

బిగ్‌బాస్‌: మోనాల్‌ డ్రెస్‌.. నాగ్‌ సలహా

nag class to avinash and noతెలుగు బిగ్‌బాస్-4 నిన్న శనివారం కావడంతో హోస్ట్‌ నాగార్జున స్టేజ్‌పై సందడి చేశాడు. ముందుగా కంటెస్టెంట్లు చేసిన త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూపిన నాగ్‌.. నోయ‌ల్‌ను రేస‌ర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఎందుకు ఆడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇక‌ సోహైల్ కోపాన్ని గెలిచేశాడ‌‌ని ప్ర‌శంసించారు. అత‌డిని పొగ‌రు అన్న అరియానాను ప్రశ్నించాడు. అయితే ‘సోహైలే వ‌చ్చి తినిపిస్తూ మ‌రీ సారీ చెప్పాడు, క‌దా! మ‌రి నువ్వు చెప్ప‌వా’ అని అడిగారు. దీంతో చెప్ప‌న‌ని మొండికేస్తూనే చివ‌రి నిమిషంలో సారీ చెప్పింది. త‌ర్వాత బిగ్‌బాస్ డీల్స్ టాస్క్‌లో సోహైల్‌- అవినాష్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో అవినాష్‌దే త‌ప్ప‌ని నాగ్ క్లారిటీ ఇచ్చేశాడు. సంచాల‌కుడిగా సోహైల్ క‌రెక్ట్‌గానే ఉన్నాడ‌ని పేర్కొన్నారు. ఇక‌ మోనాల్ ఆరు రోజులుగా ఒక‌టే డ్రెస్ వేసుకుండ‌టంతో నాగ్ ఓ స‌ల‌హా ఇచ్చారు. ఈ ఒక్క‌రోజు మోనాల్‌కు బ‌దులు ఆమె బ్లూ టీమ్‌లోని మిగ‌తా ఎవ‌రైనా ఆమె డ్రెస్ వేసుకోవాల‌ని చెప్ప‌డంతో అరియానా ముందుకు వ‌చ్చింది. బ్లూ టీమ్ వ‌దిలేసిన అర‌గుండు డీల్ పూర్తి చేసిన‌వారికి త‌ర్వాతి వారం నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని నాగ్ బంప‌ర్‌ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఈ డీల్‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఒప్పుకోవ‌డంతో నోయ‌ల్ గుండు గీశాడు.

కంటెస్టెంట్స్‌ మ‌న‌సులో మాట‌.. ఇంటిస‌భ్యులు ఒక‌రి గురించి మ‌రొక‌రు ఏమ‌నుకున్నారో రాసివ్వ‌గా వాటిని నాగ్‌ చ‌దివి వినిపించారు.
– అవినాష్‌ది టాస్కు స‌మ‌యంలో క్రూర మ‌న‌స్త‌త్వం-దివి
– మెహ‌బూబ్ ఫ్రెండ్‌షిప్ స‌ర్కిల్ సెట్‌ చేసుకుని వారిని వాడుకోవాల‌నుకుంటాడు. స్వార్థప‌రుడు కానీ స్నేహం కోసం చేస్తున్న‌ట్టు క‌ల‌ర్ ఇస్తాడు – కుమార్ సాయి
– లాస్యది మోస‌పూరిత న‌వ్వు- అమ్మ రాజ‌శేఖ‌ర్‌
– అభిజిత్‌కు చాలా అహంకారం- దివి
– నోయ‌ల్‌ది తాత్కాలిక స్నేహం- అవినాష్
– అరియానా అతిగా స్పందించ‌డం, పాడ‌టం కొన్నిసార్లు హ‌ద్దులు దాటుతుంది- మెహ‌బూబ్
– దివి.. అహంకారం, అగౌర‌వం, స‌భ్య‌త లేకుండా ఉంటుంది, ఇత‌ర మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోదు- మోనాల్‌
– అఖిల్‌ నిజాయితీప‌రుడిగా, ఎటువంటి వంచ‌న లేని మ‌నిషిగా న‌టిస్తాడు- అభిజిత్
– మోనాల్‌ అబద్ధాల కోరు- అభిజిత్
– అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఏం అరుస్తాడో, నిజాయితీ అన్న ముసుగు ఎలాగైతా ఉండాల‌నుకుంటున్నాడో అందులో దాచుకుంటాడు- అభిజిత్‌

ఈ ఎపిసోడ్‌లో లాస్య, నోయ‌ల్‌, హారిక సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఈ వారం కుమార్ సాయిని ఎలిమినేట్ అవుతాడు అనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu