HomeTelugu Trendingఅమ్మ రాజశేఖర్‌ను బయటకు గెంటేసిన ఇంటి సభ్యులు

అమ్మ రాజశేఖర్‌ను బయటకు గెంటేసిన ఇంటి సభ్యులు

nagarjuna fires on housemat 1
బిగ్‌బాస్-4 షో వీకెండ్‌ కావడంతో అందరికీ నాగార్జున ఓ రౌండ్ క్లాస్‌ ఇస్తున్నట్లు క‌నిపిస్తోంది తాజా ప్రొమోలో కనిపిస్తుంది. ప‌డ‌వ ప్ర‌యాణంలో కూడా నేను దిగిపోతానంటే నేను దిగిపోతానంటూ ‌నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను లైట్ తీసుకుంటున్నారు అని నాగ్‌ మండిప‌డ్డాడు. నామినేష‌న్స్‌ను సీరియ‌స్‌గా తీసుకోమ‌ని చెప్పిన త‌ర్వాత కూడా ప‌డ‌వ‌లో ఆడుతూ పాడుతూ ఉండ‌టాన్ని త‌ప్పుప‌ట్టారు. నీ ఆట నువ్వాడుకో అంటూ నోయ‌ల్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.

ఏంటి? సేఫ్ ఆడ‌దామ‌నుకుంటున్నారా? అని ప్ర‌శ్నిస్తూనే అది జ‌ర‌గ‌నివ్వ‌న‌ని నాగ్‌ తేల్చి చెప్పారు. మ‌రో ప్రోమోలో జీరో అనుకున్న‌వాళ్ల‌ను పంపిచేయండని నాగ్ సూచించ‌గానే అమ్మ రాజ‌శేఖ‌ర్ ను దేవి మెడపై చేయి వేసి బయటకు గెటింది. కామెడీ చేస్తే.. హీరోనా అని నాగ్‌ను తిరిగి ప్ర‌శ్నించింది దేవి. అటు లాస్య కూడా శృతి మించిన కామెడీ అని మాస్ట‌ర్‌పై మండిప‌డింది. దీంతో మాస్ట‌ర్ తాను బయటకు వెళ్లిపోతాన‌ని కోరాడు. ప్లీజ్ అంటూ చేతులెత్తి మొక్కుతూ మోకాలిపై మోక‌రిల్లి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మాస్ట‌ర్ క‌న్నీరు మున్నీరు కావ‌డంతో ఇంటి స‌భ్యులు అత‌డిని ఓదార్చారు. ఇక గంగ‌వ్వ అయితే.. మాస్ట‌ర్ హౌస్‌లో ఉండాల్సిందేన‌ని తేల్చి చెప్పేసింది. ద‌గ్గ‌ర‌కు తీసుకుని అత‌డి క‌న్నీళ్లు తుడిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu