HomeTelugu Trendingకాస్ట్‌లీ బైక్‌ను కొనుగోలు చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ

కాస్ట్‌లీ బైక్‌ను కొనుగోలు చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ

Bigg boss 5 lahari shari bu

తెలుగు బిగ్‌బాస్‌ ‌-5 ఫేం లహరి షారి పలు సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే లహరి తాజాగా ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మొత్తానికి ఈ బైక్‌ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్‌ సౌండ్‌ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆనీ మాస్టర్‌ సహా పలువురు లహరికి కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ బైక్‌ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Lahari Shari (@lahari_shari)

Recent Articles English

Gallery

Recent Articles Telugu