HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌-5' తెలుగు విన్నర్‌ సన్నీ

‘బిగ్‌బాస్‌-5’ తెలుగు విన్నర్‌ సన్నీ

winner

బిగ్‌బాస్‌-5 టాప్‌-2లో సన్నీ, షణ్ముఖ్ ఉన్నారు. బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ట్రోఫీని ప్రదర్శించారు. హౌస్‌లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో జరిగిన కొన్ని సన్నీవేశాల గురించి చర్చించాడు. నాగార్జున హౌస్‌ నుండి ఇద్దర్నీ స్టేజ్‌ పైకి తీసుకు వచ్చారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన సన్నీ విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు.. దీంతో ఆనందంతో సన్నీ నాగార్జునను ఎత్తుకున్నాడు. సన్నీ తల్లి ముద్దుల వర్షం కురిపించింది. ముందు నుండి వార్తలు వచ్చినట్లుగానే సన్నీనే బిగ్‌బాస్‌ విన్నర్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ విన్నర్‌కు ట్రోఫీ ఇచ్చే ముందు తన తల్లి కళావతిని కూడా స్టేజ్‌పైకి పిలిచారు. ఇక విన్నర్‌కి ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌, టీవీఎస్‌ అపాచీ బైక్‌ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu