HomeTelugu Trending'బిగ్‌బాస్‌-6'లో సుడిగాలి సుధీర్‌ వైల్డ్‌కార్డు ఎంట్రీ!

‘బిగ్‌బాస్‌-6’లో సుడిగాలి సుధీర్‌ వైల్డ్‌కార్డు ఎంట్రీ!

Bigg boss 6 telugu sudigali
తెలుగు బిగ్‌బాస్‌-6 ప్రారంభమై నాలుగు వారలు పూర్తైంది. ఈ సీజన్‌లో కొత్తవారు ఎక్కువ ఉండటంతో షోపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్వహాకులు మంచి క్రేజ్‌ ఉన్న వాళ్లను హౌస్‌లోకి పంపించాలి అనే ప్రయత్నం చేస్తున్నారట. అందులో భాగంగా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్‌ ఉన్నసుడిగాలి సుధీర్‌ ను వైల్డ్‌కార్డు ఎంట్రీ గా తీసుకు వస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై సుధీర్‌ గురించి తెలియని వారు ఉండారు. తనదైన స్టైల్‌లో కామెడీ, యాకరింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆయనకి మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. అందుచేత సుధీర్‌ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపిస్తే.. వర్కౌట్‌ అవుతుంది అని భావిస్తున్నారట. సుధీర్‌ని సంప్రదించిన్నట్లు టాక్‌. ఇందుకోసం సుధీర్‌ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వారం చివరిలో సుధీర్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధీర్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు వినికిడి. మరి దీనిలో ఎంత నిజం ఉందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే జబర్ధస్త్‌ నుండి ఫైమా, చంటీ లు బిగ్‌బాస్‌ షోలో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu