HomeTelugu Big Storiesరేపటి నుండి బిగ్‌బాస్‌-5.. కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే!

రేపటి నుండి బిగ్‌బాస్‌-5.. కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే!

Bigg boss telugu 5 contesta

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ – 5 రేపు ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు కూడా ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. దీంతో, కంటెస్టెంట్లను ఈరోజే హౌస్ లోకి నిర్వాహకులు పంపుతున్నారు. కంటెస్టెంట్లంతా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, మారియట్ హోటళ్లలో క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. రేపు సాయంత్రం బిగ్ బాస్ -5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

ఈనేపథ్యంలో బిగ్‌బస్‌- 5లో పాల్గొన‌బోయే ఫైన‌ల్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. యాంకర్ రవి, యానీ మాస్టర్, యూట్యూబర్ సరయు, రేడియో జాకీ కాజల్, సీరియల్ హీరో మానస్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu