HomeTelugu Big Storiesబింబిసార: రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

బింబిసార: రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

Bimbisara Release Trailer
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సినిమాలో చరిత్రలో రాజుగాను, ప్రస్తుత కాలంలో మోడ్రన్ లుక్ లోను కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌‌తో పాటు లిరికల్ పాటలను విడుదల చేస్తే మంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 29న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu