అఖిల్ హీరోయిన్ ఇల్లు కొనేసింది!

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగల్. అయితే మొదటి సినిమాతోనే ఈ బ్యూటీకి నిరాశ అయింది. గ్లామర్ పరంగా సాయేషాకు మంచి మార్కులే పడ్డా.. ఆశించిన అవకాశాలు మాత్రం లభించలేదు. అయితే హిందీ, తమిళ సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో వాటిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ లో చేసిన ‘శివాయ్’, తమిళంలో చేసిన ‘వనమగన్’ సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే ఆమె దృష్టి సౌత్ సినిమాల 
మీద ఉండడంతో ఇక్కడ మరిన్ని సినిమాలు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనేసింది. ఇదివరకు సమంత నివసించిన ఓ ఇంటిని సాయేషా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉంటూ తెలుగు, తమిళ సినిమాల్లో తన హవా పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఆ కారణంగానే ఇంటిని కూడా కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు హైదరాబాద్ లో సొంత ఇంటిని కొనుక్కొని మకాంను ఇక్కడకి షిఫ్ట్ చేసేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సాయేషా కూడా చేరింది. మరి ఇకనైనా అమ్మడుకి అవకాశాలు దక్కుతాయేమో చూడాలి!