HomeTelugu Trendingబాలీవుడ్‌ నటుడు ఆశిష్ రామ్‌ కన్నుమూత

బాలీవుడ్‌ నటుడు ఆశిష్ రామ్‌ కన్నుమూత

Bollywood Actor ashiesh roy
బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ రాయ్(55) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు (మంగళవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గత కొన్ని నెలలుగా డయాలసిస్‌ జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది అనుకునేలోపే ఇలా జరిగిపోయింది. ఆయన సోదరి కోల్‌కతా నుంచి సాయంత్రం ఇక్కడికి వస్తారు. అప్పుడే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతాయి’’ అని పేర్కొన్నారు. కాగా సినీ, టీవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(సింటా) ఆశిష్‌ రాయ్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా, అశ్విని చౌదరి సహా నటులు సూరజ్‌ థాపర్‌, ఆసిఫ్‌ షేక్‌, టినా ఘాయ్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu