HomeTelugu Trendingరియాకు సోషల్‌ మీడియాలో పెరుగుతున్న మద్దతు

రియాకు సోషల్‌ మీడియాలో పెరుగుతున్న మద్దతు

Bollywood celebs supporting
బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. సుశాంత్ మృతి విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తికి నిన్న ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 28 రోజుల పాటు జైలులో ఉన్న రియా జైలునుంచి విడుదలయింది. ఆమెకు బెయిల్ ఇవ్వడాన్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సంఘీభావం తెలుపుతున్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం ఓ నటిని, తన కుటుంబ గౌరవాన్ని నాశనం చేయాలనుకుంటున్న వారిని చూస్తే సిగ్గుగా ఉందంటూ నటి హుమా ఖురేషీ పోస్టు చేసింది. సుశాంత్ మృతిని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన అందరిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. రియా నిరాశకు గురికాకూడదని తాప్సీ ట్వీట్ చేసింది. సుశాంత్‌కు న్యాయం జరగాలనుకుంటున్న కొందరి కోపం రియాను జైలులో చూశాక అయినా తగ్గిందని భావిస్తున్నాను అని పేర్కొంది. రియాపై దయచూపినందుకు దేవుడికి ధన్యవాదాలు అంటూ దర్శకురాలు ఫర్హాన్ తెలిపింది. మొత్తానికి రియాకు బెయిల్ వచ్చిందని దర్శకుడు అనుభవన్ సిన్హా ఇలా పలువురి నుంచి రియాకు మద్దతు వెల్లువెత్తుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu