HomeTelugu Big Storiesసుకుమార్ పై బాలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్‌ ప్రశంసలు

సుకుమార్ పై బాలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్‌ ప్రశంసలు

Bollywood director raj kuma
టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ సినిమాకి క్రియేటీవ్ జీనియ‌స్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో సుకుమార్ బ్రిలియంట్ రైటింగ్, టేకింగ్ సినీ ప్రముఖుల‌ను ఫిదా చేసింది. హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ సుకుమార్ ప్ర‌తిభ‌కు ఆశ్చ‌ర్య‌పోయింది. ఎంద‌రో బాలీవుడ్ ప్రముఖులు సుక్కును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణీ, సుకుమార్ ప్ర‌తిభ‌ను మెచ్చుకుంటూ వాట్స‌ప్‌లో ఓ సందేశం పంపాడు.

‘గుడ్‌మార్నింగ్ సుకుమార్‌ గారు. నేను మీకు చాలా కాలం క్రీత‌మే మేసేజ్ చేసుండాల్సింది. పుష్ప చిత్రం చూసిన‌ప్ప‌టి నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ మీ నంబ‌ర్ నా ద‌గ్గ‌ర లేదు. నిన్న మ‌హ‌వీర్ జైన్‌ను క‌లిసి మీ నంబ‌ర్ తీసుకున్నాను. ఇప్ప‌టికే ఎంతో మందితో ఈచిత్రం గురించి మాట్లాడాను. ఒక సినిమా గురించి ఇంతలా మాట్లాడ‌టం వాళ్ళంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. మీ రైటింగ్, ప్ర‌తి స‌న్నివేశాన్ని మీరు మ‌లిచిన తీరు గొప్ప‌గా ఉంది. న‌టీనటుల ప‌ర్ఫార్మెన్స్‌, సంగీతం అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను చూసేట‌ప్పుడు నేనెంత‌గానో ఎంజాయ్ చేసాను. ఇలానే మీరు అద్భుత‌మైన సినిమాలు తీయండి. మీరు ముంబై వ‌చ్చిన‌ప్పుడు కాల్ చేయండి క‌లుద్దాం’ అంటూ సందేశాన్ని పాంపాడు.

దీనిపై సుకుమార్ స్పందిస్తూ ‘ఫిలిం మేకింగ్‌లో మాస్ట‌ర్ లాంటి మీ ద‌గ్గ‌ర నుండి మెసేజ్ రావ‌డం నాకెంతో అనందాన్ని ఇచ్చింది. మీ మెసేజ్‌కు ఇంత లేట్‌గా రెస్పాన్స్ రావ‌డానికి కార‌ణం నా మిత్రుల‌కు మీరు పంపిన‌ సందేశాన్ని ఫార్వ‌ర్డ్ చేయడం’ అంటూ సుక్కు స్పందించాడు. అంతేకాకుండా ‘రైటింగ్‌లో, ఫిలిం మేకింగ్‌లో మీరే నాకు స్పూర్తి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక పుష్ప పార్ట్2 కోసం తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌మానంగా బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్ట‌నుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu