HomeTelugu Big StoriesTollywood: గ్లామర్‌తో హీటెక్కిస్తున్న సీనియర్‌ హీరోయిన్‌లు

Tollywood: గ్లామర్‌తో హీటెక్కిస్తున్న సీనియర్‌ హీరోయిన్‌లు

Tollywood senior heroines are trending

Tollywood: టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్‌ హీరోయిన్‌లు శ్రీలీల, మృణాల్‌ ఠాకూర్‌ హవా నడుస్తుంది. ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీస్టార్‌ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై మంచి హైప్స్‌ ఉన్నాయి. ఇక సీనియర్‌ హీరోయిన్‌లు తాము కూడా తక్కువ కాదంటూ ఎప్పటికప్పుడు గ్లామర్‌ షోలతో సోషల్‌ మీడియాను హీటెక్కిస్తున్నారు.

heroinse2 Tollywood,Anupama,Shruti Haasan,Samantha,Rakul Preet Singh,Trisha

అనుపమ: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ వరుస సినిమాలు చేసి మంచి హిట్‌లను తెచ్చుకుంది. ఆ తరువాత.. ఆమెకు అవకాశాలు తగ్గాయి.. ఈ క్రమంలో బ్యూటీ గ్లామర్‌ డోస్‌ పెంచేసింది. ఇటీవలే ఆమె నటించిన టిల్లు స్క్వేర్‌ విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ట్రైలర్‌లో అనుపమ..లిప్‌ కిస్‌లు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో ఓరేంజ్‌లో రెచ్చిపోయింది. ఒక రకంగా అనుపమ గ్లామర్‌ మరియు బోల్డ్‌నెస్‌ ఈ సినిమాకి ప్లస్‌ అయిందని చెప్పవచ్చు.

heroinse1 Tollywood,Anupama,Shruti Haasan,Samantha,Rakul Preet Singh,Trisha

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌: రకుల్‌ కూడా యంగ్‌ బ్యూటీలకు పోటీగా గ్లామర్‌ డోస్‌ బాగా పెంచేసింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేనప్పటికీ.. సోషల్‌ మీడియాలో వరుస ఫొటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. పెళ్లయి నెల కూడా కాకుండానే.. హాట్‌ ఫోటో షూట్‌ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. పెళ్లికి, కెరీయర్‌కు సంబంధం లేదు.. దేనికదే అంటోంది రకుల్.

Untitled 3 Tollywood,Anupama,Shruti Haasan,Samantha,Rakul Preet Singh,Trisha

సమంత: టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సమంత తన ఆరోగ్య సమస్య కారణంగా..సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న ఈ అమ్మడు రీ ఎంట్రీ కోసం చూస్తుంది. దీనికోసం సరైన కమ్‌ బ్యాక్‌ కోసం ఎదురు చూస్తోంది సమంత. ఈ క్రమంలో సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్‌.

Untitled 4 Tollywood,Anupama,Shruti Haasan,Samantha,Rakul Preet Singh,Trisha

శృతి హాసన్‌: శృతి కూడా రీఎంట్రీ తరువాత వరుస హిట్‌లతో దూసుకుపోతోంది. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్‌తో శృతిహాస‌న్ Inimel మ్యూజిక్ వీడియో విడుదల చేయ‌గా.. నెట్టింట వ్యూస్ రాబ‌డుతోంది. ప్రస్తుతం ఆమె చెన్నై స్టోరీస్ అనే సినిమా చేస్తుంది.

Untitled 5 Tollywood,Anupama,Shruti Haasan,Samantha,Rakul Preet Singh,Trisha

త్రిష: త్రిష కూడా రీఎంట్రీ తరువాత వరుస హిట్‌లతో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు కొట్టేస్తుంది. రీఎంట్రీ తరువాత ఈ అమ్మడు గ్లామర్‌ మరింత పెంచేసింది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు తమిళ హీరో విజయ్‌, వెంకటేష్‌ వంటి స్టార్ హీరోలతో నటించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా అల్లు అర్జున్‌ అప్‌కమింగ్‌ మూవీలో కూడా ఈ బ్యూటీ నటించనున్నట్లు టాక్. వీరితో పాటు, మిల్కీ బ్యూటీ తమన్నా, నయన్‌ తార, కీర్తి సురేష్‌లు కూడా గ్లామర్‌ డోస్‌ని పెంచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu