HomeTelugu Newsచరణ్‌ సినిమాలో స్పెషల్ సాంగ్‌ కోసం హాట్‌ బ్యూటీ!

చరణ్‌ సినిమాలో స్పెషల్ సాంగ్‌ కోసం హాట్‌ బ్యూటీ!

1 13మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కథనాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్‌ మసాల ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మరింత గ్లామర్‌ యాడ్‌ చేసేందుకు ఓ స్పెషల్‌ సాంగ్‌ను తెరకెక్కించనున్నారు. బోయపాటి సినిమాలతో పాటు చరణ్ సినిమాల్లోనూ స్పెషల్‌ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్‌ కనిపిస్తుంటారు. తమన్నా, పూజా హెగ్డే, కేథరిన్‌ లాంటి వారు వీరి సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు.

ఈ సినిమాలో కూడా ఓ క్రేజీ స్టార్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట చిత్రయూనిట్‌. దీని కోసం ఓ బాలీవుడ్ హాట్‌ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సినిమాలతో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తున్న ఈషా గుప్తా, వినయ విధేయ రామలో చరణ్ సరసన ఆడిపాడనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu