HomeTelugu Newsనగ్నంగా నటించిన నా భర్త ఏమీ అనడు: హేట్‌ స్టోరీ 2 బ్యూటీ

నగ్నంగా నటించిన నా భర్త ఏమీ అనడు: హేట్‌ స్టోరీ 2 బ్యూటీ

12 3టాలీవుడ్‌లో సమంత లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే పెళ్లి తర్వాత యాక్టింగ్ కొనసాగిస్తున్నారు కానీ బాలీవుడ్‌‌లో మాత్రం అలా కాదు. అక్కడ పెళ్లికి, నటనకు అస్సలు పొంతన ఉండదు. అలాగే అక్కడ వరస సినిమాలు చేస్తున్నారు వాళ్లు. నటన, వివాహం అస్సలు సంబంధం లేని అంశాలు అంటారు వాళ్లు.

ఇదే క్రమంలో సుర్వీన్‌ చావ్లా కూడా పెళ్లి తర్వాత కూడా నటిస్తూ బిజీగా ఉంది. అసలు ఈ భామకు పెళ్లైన సంగతి చాలా రోజుల వరకు తెలియదు. తెలుగులో కూడా శర్వానంద్, మోహన్ బాబు హీరోలుగా నటించిన రాజు మహరాజు సినిమాలో నటించింది సుర్వీన్. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా వైపు చూడలేదు ఈ బ్యూటీ. బాలీవుడ్ వెళ్లి అక్కడ హేట్ స్టోరీ 2 అనే సినిమాతో అదిరిపోయే అందాల ఆరబోత చేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా పూర్తిగా హాట్ వెబ్ సిరీస్‌లు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది సుర్వీన్.

తాను ఎలాంటి గ్లామర్‌ పాత్రల్లో నటించడానికైనా రెడీ అంటూ దూసుకొస్తుంది సుర్వీన్. పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయిలో అందాలు ఆరబోయడం ఏంటి.. ఇంట్లో ఎలాంటి సమస్యలు రావడం లేదా అంటే ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తుంది ఈ భామ. తనకు ఇలా నటించడానికి తన భర్త పూర్తి మద్దతు ఉందని చెబుతుంది. నాలుగేళ్ల కిందే వరస సినిమాలతో బిజీగా ఉన్నపుడే 2015లో పెళ్లి చేసుకుంది సుర్వీన్.

తాను ఎంత హాట్‌గా నటించినా.. చివరికి నగ్నంగా కనిపించినా కూడా తన భర్త ఏమి అనడని.. అనుకోడని చెప్పింది సుర్వీన్. ఇదంతా నటనే కదా అని అర్థం చేసుకుంటారని పై నుంచి సంచలన వ్యాఖ్యలు చేసింది సుర్వీన్ చావ్లా. మొత్తానికి ఈమె అనడం ఏమో కానీ నిజంగానే నగ్నంగా కూడా నటించేసింది ఈ బ్యూటీ. ఈ రేంజ్‌లో సపోర్ట్ చేసే భర్త దొరికితే అమ్మో ఇంకేమైనా ఉందా..?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!