HomeTelugu Big StoriesSandeep Reddy Vanga to Atlee: సౌత్‌ డైరెక్టర్ల టాలెంట్ కి బాలీవుడ్ ఫిదా

Sandeep Reddy Vanga to Atlee: సౌత్‌ డైరెక్టర్ల టాలెంట్ కి బాలీవుడ్ ఫిదా

Sandeep Reddy Vanga to Atle Sandeep Reddy Vanga to Atlee,Bollywood,Sailesh Kolanu,Sudha Kongara

Sandeep Reddy Vanga to Atlee: దక్షిణాది దర్శకులు మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. సౌత్ నుంచి కొందరు దర్శకులు హిందీ సినిమాలకు డైరెక్టర్లుగా మారుతున్నారు. బాలీవుడ్ బాట పడుతున్నారు. అక్కడి స్టార్ హీరోలతో యాక్షన్, కట్ చెప్తున్నారు. బాక్సాఫీస్ పవర్ ఏమిటో చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్‌తో మూవీసి తీసి హిందీ ఆడియన్స్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు.

ఒక్క ఛాన్స్ దొరికితే చాలు కొందరు దూసుకుపోతుంటారు. వాళ్ల ప్రతిభ ఏమిటో చూపిస్తుంటారు. అలాంటివాళ్లలో ఒకడు కోలీవుడ్ దర్శకుడు అట్లీ. రాజారాణి వంటి చిన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకుని దళపతి విజయ్‌నే డైరెక్షన్ చేసే అవకాశం కొట్టేశాడు. రెండో సినిమా తేరీతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత మెర్సల్ బిగిన్ అంటూ విజయ్‌కు అట్లీ ఒకదాన్ని మించి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాడు. టాలెంట్ ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు.. వాడికి అవకాశాలు వెతుక్కుంటూ అవే వస్తాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్ ఏరికోరి దర్శకుడు అట్లీని ఎంచుకున్నాడు. అట్లీ కూడా బాద్‌షా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అని నిరూపించాడు. జవాన్ సినిమాతో షారుక్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టింది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో తయారైన ఈ సినిమా హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

టాలీవుడ్ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. కూడా బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌ను యానిమల్‌గా మార్చేశాడు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంతో పాటు.. ప్రియుడు, ప్రియురాలి మధ్య గట్టి రిలేషన్‌ను ఈ మూవీలో చూపించాడు. సందీప్‌ వంగారెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ మూవీకి సీక్వెల్ పార్ట్ కూడా ఫిక్స్ అయింది. అర్జున్ రెడ్డి మూవీతో మెగాఫోన్ పట్టుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను హిందీలో కబీర్‌సింగ్‌గా రూపొందించాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీ ప్రేక్షకుల్లో సందీప్‌రెడ్డి వంగాకు మంచి గుర్తింపు తెచ్చింది.

బాలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలు హిట్ కోసం సౌత్ దర్శకులపైనే ఆధారపడుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటివరకు బాలీవుడ్‌కే పరిచయమైన దర్శకులు తమ సత్తా ఏమిటో చూపించడంతో ఇక్కడి డైరెక్టర్లపై కూడా నమ్మకం మరింత పెరిగింది. నాని నిర్మించిన హిట్ సినిమాతో హిట్ కొట్టాడు టాలీవుడ్ దర్శకుడు శైలేష్ కొలను. ఒక్క సినిమా విజయంతోనే బాలీవుడ్ పిలుపును అందుకున్నాడు. ఈ మూవీ హిందీ రీమేక్‌కు కూడా మెగాఫోన్ పట్టుకున్నాడు. తెలుగు హిట్‌ మూవీలో విశ్వక్సేన్ నటిస్తే.. హిందీలో రాజ్‌కుమార్‌రావ్ హీరోగా కనిపించాడు.

మాస్ సినిమాల దర్శకుడు వీవీ వినాయక్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అల్లుడు శ్రీనుతో బెల్లంకొండ సాయిని హీరోగా పరిచయంచేసిన సంగతితెలిసిందే. ఆ తర్వాత ఈ కుర్రోడు తెలుగులో హిట్ కొట్టిన చత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన వీవీ వినాయక్‌ను ఈసినిమాతో దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.

సౌత్‌లో హిట్ కొట్టిన సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. ఇందులో ఒరిజినాలిటీ మిస్ కాకూడదని ఆమూవీని రూపొందించిన దర్శకుడినే మళ్లీ ఎన్నుకుంటున్నారు. సుధా కొంగర అక్షయ్‌కుమార్ సినిమాకు డైరెక్ట్ చేయబోతున్నారు. సూర్య హీరోగా రూపొందించిన ఆకాశమే నీహద్దురా మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీకి సుధా కొంగర దర్శకురాలు. ఇప్పుడు ఇదే మూవీ హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతోంది. దీనికి సుధాకొంగర దర్శకత్వం చేస్తున్నారు.

2017లో కోలీవుడ్‌లో వచ్చిన విక్రమ్ వేదా మంచి విజయం సాధించింది. మాధవన్, విజయ్‌సేతుపతి వంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. రూ.11 కోట్లతో రూపొందించిన ఈ మూవీ దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే బాలీవుడ్‌లో మాత్రం స్టార్‌ హీరోలు ఈ మూవీ రీమేక్‌లో నటించారు. విక్రమ్ వేదా హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. 2022లో ఈ మూవీ రీమేక్ అయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అనుకున్నంత రాబట్టలేక పోయింది. తమిళంలో విక్రమ్ వేదాను రూపొందించిన పుష్కర్ గాయత్రి రీమేక్‌కు దర్శకురాలుగా వ్యవహరించారు.

ఒకప్పుడు హీరోలకే ఎక్కువగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు కాలం మారింది.. దర్శకులకు కూడా భారీగా డిమాండ్ వస్తోంది. అప్పట్లో హీరోల కోసం దర్శకులు వేచిచూసేవారు. ఇప్పుడు హీరోలే దర్శకుల కోసం ఎదురుచూస్తున్నారు. నాని హీరోగా రూపొందించిన జెర్సీ మూవీ స్పోర్ట్స్ అంశంతో తెరకెక్కింది. ఈసినిమా నానికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయం సాధించింది. ఇదే మూవీ హిందీలో జెర్సీ పేరుతో రీమేక్ జరుపుకుంది. టాలీవుడ్‌ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్న జెర్సీ హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు.

బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన బాడీగార్డ్ మూవీని తెరకెక్కించిన సిద్ధిఖి కూడా సౌత్ ఇండియన్ డైరెక్టరే. సౌత్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ డైరెక్ట్ చేసి సత్తా చూపించే ట్రెండ్ ఇప్పటిది కాదు. అలనాటి దర్శకులు కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు దగ్గర నుంచి నిన్నటి రామ్‌గోపాల్ వర్మ వరకు ఎందరో టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌లో తమ ప్రతిభ చూపించారు. హిందీ ఆడియన్స్‌తో శభాష్ అనిపించుకున్నారు. శివతో దర్శకుడిగా మారి ట్రెండ్ క్రియేట్ చేసిన రాంగోపాల్ వర్మ.. ఇదే సినిమా హిందీలో రీమేక్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శివ మూవీతో బాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా నచ్చింది. శివ తర్వాత మరికొన్ని హిట్ మూవీస్‌ను డైరెక్ట్ చేశాడు వర్మ. సంజయ్‌దత్, అమీర్‌ఖాన్ వంటి నటుల చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. హిందీలో రంగీలా మంచి విజయంతో పాటు భారీ వసూళ్లను రాబట్టింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సత్య మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

హిందీ సినిమాలకు దర్శకులుగా మారి కొందరు సక్సెస్ అయితే మరికొందరు అక్కడి ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయారు. రాబోయే కాలంలో కూడా కొందరు బాలీవుడ్‌ మూవీస్‌కు డైరెక్షన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో మంచి గుర్తింపుతెచ్చుకున్న ప్రస్థానం మూవీకి దేవ కట్ట. ఈ మూవీ హిందీ రీమేక్‌కు కూడా దేవకట్ట దర్శకత్వం వహించాడు.

సంజయ్ దత్, జాకీష్రాఫ్ వంటివారు హిందీ రీమేక్‌లో నటించారు. దర్శకుడు తేజ తన హిట్ మూవీ జయం. ఈ సినిమాను కూడా హిందీలో ఏ దిల్‌ హై పేరుతో తేజ రీమేక్‌ చేశారు. మరోవైపు మురుగదాస్, ప్రభుదేవా, లారెన్స్ వంటి దర్శకులు కూడా బాలీవుడ్‌లో సినిమాలు డైరెక్ట్ చేశారు. మత్తువదలరా మూవీ రితేష్ రానాకు మంచి పేరు తెచ్చింది. కుర్ర హీరో సింహాకు మొదటి విజయాన్ని అందించింది. ఈ మూవీకూడా హిందీలో రీమేక్ కాబోతుంది. ఈ సినిమాకు హిందీలో కూడా రితేష్ రానా దర్శకత్వం వహించబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu