HomeTelugu Newsబాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత

4బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఖాదర్ ఖాన్‌(81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాదర్‌ ఖాన్‌ కెనడాలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సర్ఫరాజ్‌ వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. దాదాపు 17 వారాల పాటు ఖాదర్‌ ఆస్పత్రిలోనే ఉన్నారు. కెనడాలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో జన్మించిన ఖాదర్‌ 1973లో వచ్చిన ‘ధాగ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. 250 చిత్రాలకు డైలాగులు రాశారు. ఖాదర్‌ మరణవార్త తెలిసి బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu