HomeTelugu Trendingపవన్‌ సినిమాలో డ్రైవర్‌గా బ్రహ్మాజీ!

పవన్‌ సినిమాలో డ్రైవర్‌గా బ్రహ్మాజీ!

Brahmaji in pawan kalyan mo
గతేడాది మలయాళంలో రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రీమేక్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమైంది కానీ ఇంతవరకు సినిమా పూర్తికాలేదు. అయితే ఈ యాక్షన్ డ్రామా మూవీ కేవలం ఇద్దరు వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంది. మద్యానికి బానిసైన ఒక రిటైర్డ్ హవాల్దారుకి అతన్ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారికి మధ్య రగిలిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. ఈ సినిమాలో పోలీస్ అయ్యప్పన్ పాత్రలో బిజుమీనన్ కోషి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. అయితే తెలుగు రీమేక్ పృథ్వీరాజ్ పాత్రలో రానా అయ్యప్పన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ గురించి వార్త వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో రానా పాత్రకు ఓ డ్రైవర్ ఉంటాడు. అది డ్రైవర్ పాత్రే అయినప్పటికీ సినిమాలో కీలకంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పాత్రలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ పోషించనున్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయనే ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ రచనలో భాగం కాగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu