HomeTelugu Trending'బుట్టబొమ్మా' సాంగ్‌ వీడియో వైరల్‌

‘బుట్టబొమ్మా’ సాంగ్‌ వీడియో వైరల్‌

2 29
స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ లిరికల్‌ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే తాజాగా నటి పూజాహెగ్డే ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను ఆదివారం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ”బుట్టబొమ్మా’కు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియో మీకోసం. ఎవరికీ చెప్పకండి’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు. ఈ వీడియోలో పూజాహెగ్డే-బన్నీ డ్యాన్స్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరోవైపు శనివారంతో ‘అల.. వైకుంఠపురమలో..’ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌ ఓ స్పెషల్‌ పోస్ట్‌ను విడుదల చేసింది. ”అల..వైకుంఠపురములో..’ షూటింగ్‌ పూర్తైందని చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా విడుదల రోజు వరకూ ఆసక్తికర అప్‌డేట్స్‌ను మీకందిస్తాం. ఈ సంక్రాంతికి థియేటర్లలో పండగ చేసుకోడానికి సిద్ధంకండి’ అని గీతా ఆర్ట్స్‌ పేర్కొంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 12న ఈ సినిమా విడుదల చేయనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu