HomeTelugu Trendingనటి సంజన ఇంట్లో సీసీబీ సోదాలు

నటి సంజన ఇంట్లో సీసీబీ సోదాలు

CCB Raids Actor Sanjana Gal
కన్నడ చిత్రం పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సంజన గల్రాని ఇంట్లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఈమె తెలుగులో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాతో నటించింది. ఆ సినిమా తరవాత ఒకటి అరా తెలుగు సినిమాల్లో నటించింది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆ తర్వాత ఈ భామ అడపాదడపా హిందీ ,కన్నడ, మలయాళంలో నటిస్తున్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. డ్రగ్స్ కేసులో డ్రగ్స్ డీలర్స్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు రావడంతో సీసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సంజన ఈవెంట్ మేనేజర్ ప్రీతం శెట్టి ఇచ్చిన సమాచారంతో ఇందిరానగర్‌లోని ఆమె ఇంట్లో సీసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆధారాలు దొరికితే సంజనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu