బన్నీకి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తనదైన స్టైల్, డ్యాన్స్, తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి బుధవారం విడుదలైన ‘పుష్ప’ టీజర్‌ని తాను చూశానని తెలిపారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌.. తగ్గేదే లే!’ అంటూ చిరు విషెస్ తెలియజేశారు. టీజర్‌ ఊరమాస్‌ లెవల్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం బన్నీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. బగ్సీ!’ అంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటుగా పలువురు ప్రముఖులు బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates