పవన్‌ కల్యాణ్‌ కి చంద్రబాబు సూచన..!

ఇవాళ కాకినాడలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్‌ ఊడిగం చేస్తున్నారని అన్నారు. వైసీపీని నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయమని చెప్పారు. మొన్నటి వరకు ప్రతిపక్ష నేత కోడి కత్తి అంటూ హడావిడి చేశారని.. ఇప్పుడు సీబీఐ కత్తితో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాడాలని బాబు సూచించారు. ఆర్థిక వనరులున్న తెలంగాణను వదిలిపెట్టి.. ఏపీ వ్యవహారాల్లో కేసీఆర్‌ తలదూర్చి అడ్డుపడుతున్నారని బాబు అసహనం వ్యక్తం చేశారు.