100 థియేట‌ర్స్‌లో ‘శాత‌క‌ర్ణి’ ట్రైల‌ర్!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కూడా  కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల‌విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌ను 2.6 మిలియ‌న్స్ ఆడియెన్స్ వీక్షించారు. ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి భారీ ఎత్తున్న స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.  ఈసంద‌ర్భంగా…
 చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. ”నంద‌మూరి బాల‌కృష్ణ‌గారు న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుద‌ల కోసం తెలుగు ప్రేక్ష‌కులు, నంద‌మూరి అభిమానులు జ‌న‌వ‌రి 12, సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ‌గారు న‌టించిన 100వ చిత్రం కావ‌డంతో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను యు.ఎస్‌., యు.కె. స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో ఒకేసారి విడుల‌య్యేలా ప్లాన్ చేశాం. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ వేడుక‌ను గ్రాండ్ లెవ‌ల్లో పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం” అన్నారు.
CLICK HERE!! For the aha Latest Updates