HomeTelugu Trendingమాచర్ల నియోజక వర్గం : 'చిల్ మారో' లిరికల్‌ వీడియో విడుదల

మాచర్ల నియోజక వర్గం : ‘చిల్ మారో’ లిరికల్‌ వీడియో విడుదల

Chill Maro Lyrical from Mac

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. ఇందులో నితిన్ ఐఏఎస్ అధికారిగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై ఎన్. సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీని ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ నేఫథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చాలా రోజుల తరువాత నితిన్ మళ్లీ సరికొత్త పాత్రలో మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘చిల్ మారో’ అంటూ సాగే లిరికల్ వీడియో ను స్టార్ హీరో కమల్ హాసన్ విడుదల చేశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని నితిన్ కేథరిన్ లపై బీచ్ నేపథ్యంలో చిత్రీకరించారు.

కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్ సంజన కల్మాంజే యమ జోష్ గా ఆలపించి మరింత జోష్ని యాడ్ చేశారు. ఈ పాటలో నితిన్ మరింత స్టైలిష్ గా కనిపించి తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. కేథరిన్ మాత్రం చాలా హాట్ గా కనిపించింది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu