HomeTelugu Big Storiesమెగాస్టార్‌ 154 సినిమాలో ఆ హీరోయిన్‌ ఫిక్స్‌.. ప్రకటించిన మూవీ యూనిట్‌

మెగాస్టార్‌ 154 సినిమాలో ఆ హీరోయిన్‌ ఫిక్స్‌.. ప్రకటించిన మూవీ యూనిట్‌

chiranjeevi 154 movie heroi
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్‌ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిరింజీవి మరో చిత్రం భోళా శంకర్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రం ఒకటి. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్‌.

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని హీరోయిన్‌ ఎవరో పరిచయం చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున ఇంతకంటే మంచి వార్త ఏం ఉంటుంది. వెల్‌కమ్‌ శృతి అంటూ సినిమా యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే మొదటి నుంచే ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌ అని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ప్రభాస్‌ సరసన సలార్‌లో, గోపిచంద్‌ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణకు జోడిగా శృతిహాసన్‌ నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu