నందమూరి హీరో లొకేషన్ లో మెగాహీరో!

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిస్థాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం గత కొన్ని రోజులుగా లొకేషన్స్ ను వెతికే పనిలో పడ్డారు. హైదరాబాద్ లోనే సెట్ వేసి తీయాలనుకున్నారు. తరువాత మళ్ళీ కేరళ వెళ్లాలనుకున్నారు.

కానీ చివరగా పాపికొండలు, పోలవరం సమీపంలో గల విలేజ్ లో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నెలరోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఏప్రిల్ 1 నుండి షూటింగ్ జరగనుంది. ఆ తరువాత గోదావరి తీరంలో ఓ విలేజ్ లో షూటింగ్ జరపనున్నారు. గతంలో బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమా షూటింగ్ కూడా అక్కడే జరిపారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ లొకేషన్ లో సినిమా షూటింగ్ జరగబోతోంది.