HomeTelugu Trendingనోరు జారిన మెగాస్టార్‌.. టైటిల్‌ మార్చే ఆలోచనలో కొరటాల!

నోరు జారిన మెగాస్టార్‌.. టైటిల్‌ మార్చే ఆలోచనలో కొరటాల!

5 1
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘152’ వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకు ఇప్పటికే లీకుల బెడద ఎక్కువైంది. ఇటీవల ఈ సినిమా నుంచి చిరంజీవి లుక్ లీక్‌ అయింది. దాంతో పాటు ఒక చిన్న వీడియో కూడా లీక్ అయ్యింది. ఈవిషయం పై ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కూడా సీరియస్ అయ్యారు షూటింగ్ స్పాట్ కు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావద్దని షరతులు విధించాడు. కాగా తాజాగా ‘ఓ పిట్ట కథ’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ.. నోరు జారీ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. కొరటాల తో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న అంటూ చిరు టైటిల్ ను బయట పెటేసారు. ఆ తరువాత నాలుక కార్చుకుంటూ కొరటాల గ్రాండ్ గా అనౌన్స్ చేద్దామనుకున్నాడేమో నేను తొందర పడ్డాను అంటూ నవ్వేశారు చిరు. కాగా ఇప్పుడు ఈ టైటిల్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ రివీల్ కావడంతో ఆ టైటిల్ ను మార్చే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మొదట్లో ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. మరి టైటిల్ మార్చనున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంత వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu