చిరంజీవి కీలక నిర్ణయం.. ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ పాత్రలో మరో హీరో!


మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషణ్‌లో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం రాజమౌలి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఆచార్య చిత్రానికి డేట్స్‌ సర్దుబాటు అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.

అయితే ఈ టైమ్‌లో చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆచార్యలో చరణ్ కోసం అనుకున్న పాత్రలో మరో హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొరటాల శివ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో మహేష్‌బాబు ఈ చిత్రంలో నటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ పాత్ర కోసం మూవీయూనిట్‌ మహేష్‌నే సంప్రాదిస్తుందా .. లేక వేరే హీరోని ఈ పాత్ర కోసం ఎంపిక చేస్తుందో వేచి చూడాల్సిందే.

CLICK HERE!! For the aha Latest Updates