HomeTelugu Big Stories'ఆచార్య' సృష్టికర్తకు జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి

‘ఆచార్య’ సృష్టికర్తకు జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి

Chiranjeevi and ram charanటాలీవుడ్ సినీ దర్శకుడు కొరటాల శివ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి హిట్‌ చిత్రాలను అందించిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ ట్వీట్‌లు వైరల్‌ అవుతున్నాయి.

తన దర్శకుడు కొరటాల పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఆచార్య’ సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. “ఆ కలానికి సమాజంలో మార్పు తేవాలన్న తపన ఉంది. ఆ దర్శకుడికి ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

రామ్ చరణ్ కూడా దర్శకుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా కొరటాల తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశాడు. ‘ఆచార్య’ సెట్ లో తీసిన ఈ పిక్ లో చరణ్ – శివ ఇద్దరూ ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. సిద్ధ గెటప్ లో చెర్రీ ఆకట్టుకుంటున్నాడు. కాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రమిది. ఇందులో చిరు దేవాదాయ శాఖ ఉద్యోగిగా కనిపించనున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu