HomeTelugu Trending'నారప్ప'పై చిరు ప్రశంసలు

‘నారప్ప’పై చిరు ప్రశంసలు

venkatesh

వెంకటేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందనను తెలియజేశారు. ‘నారప్ప’ సినిమాను చూశాను .. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. తెరపై నాకు ‘నారప్ప’ తప్ప ఎక్కడా వెంకటేష్‌ కనిపించలేదు. ఆయన ఆ పాత్రను లోతుగా అర్థం చేసుకున్న తీరు .. సన్నివేశాలను పండించిన విధానం గొప్పగా ఉన్నాయి. వెంకటేష్‌ కెరియర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ఇది” అని అన్నారు.

చిరంజీవి అభినందనల పట్ల వెంకటేష్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మీ ప్రతి మాట నాకు ఎంతో ఆనందాన్నీ.. సంతృప్తిని కలిగించాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. ఇక ఇదే విధంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, ఈ సినిమాలో వెంకటేష్‌ నటనను ప్రస్తావిస్తూ ప్రశంసలను అందజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu