
Chiranjeevi Balayya Pawan Kalyan Upcoming Movies 2025:
ఈ సంవత్సరం దసరా పండుగకు తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ సినిమా పండుగే కనిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ రీలీజ్‌కి లాక్ అయింది. తరువాత పవన్ కల్యాణ్ క్రేజీ గ్యాంగ్‌స్టర్ డ్రామా OG కూడా అదే సీజన్‌ని టార్గెట్ చేస్తూ ఎంటర్ అయ్యింది.
ఇద్దరూ కలిపి రిలీజు డేట్‌లను అడ్జస్ట్ చేసుకుంటారేమో అనుకున్న టైంలో చిరంజీవి కూడా తన భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన విశ్వంభర మూవీతో దసరా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా పోస్ట్‌పోన్ అయి, ఇప్పుడు సెప్టెంబర్ 18 టార్గెట్ చేస్తోంది.
ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. మూడు పెద్ద సినిమాలు ఒకేసారి దసరా సీజన్‌లో రావడం చాలా కష్టం. వ్యాపార పరంగా కూడా మూడింటికి ఒకే సీజన్‌లో రిలీజైతే లాభాలపై ప్రభావం ఉంటుంది. అందుకే అందరి దృష్టి ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు వెనక్కి తగ్గుతారన్నదానిపై ఉంది.
ప్రస్తుతం OG దర్శకుడు సుజీత్, అఖండ 2కి బోయపాటి శ్రీను, విశ్వంభరకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రేసులో ఒక సినిమా తప్పక వెనక్కి తగ్గాల్సిందేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. లేకపోతే టిక్కెట్ షేర్, థియేటర్లు అన్నీ ఇబ్బంది అవుతాయి.
డిసెంబర్, జనవరి నెలలలో ఇప్పటికే భారీ సినిమాల ఖాళీలు లేవు. కనుక ఎవరు వెనక్కి తగ్గుతారు? చిరు లొబడ్తారా? పవన్ ఒప్పుకుంటారా? బాలయ్య అడ్జస్ట్ అవుతారా? – అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
ALSO READ: Baahubali: The Epic ఇంత క్రేజ్ వెనుక అసలు కారణం అదేనా?













