HomeTelugu Trendingసూర్యకు చిరంజీవి బర్త్‌డే విషెస్‌

సూర్యకు చిరంజీవి బర్త్‌డే విషెస్‌

Chiranjeevi birthday wishes
శనివారం(జూలై 23) తమిళ స్టార్‌ హీరో సూర్య.. బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్‌, సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ స్టార్‌ హీరోగా గుర్తింపు పొందాడు సూర్య. కోలీవుడ్‌ లోనే కాకుండా.. సూర్యకు టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. నేడు సూర్య పుట్ ఇక ఆయన నటించిన సూరరై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రం తాజాగా 68వ జాతీయ అవార్డుకు ఎన్నికవడం, నేడు సూర్య బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్‌ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

అంతేకాదు ఈ సందర్భంగా సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకోవడంపై కూడా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సైతం సూర్యకు బర్త్‌డే శుభాకాంక్షలుతో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా విషెస్‌ తెలిపాడు. ’68వ జాతీయ అవార్డు గెలుచుకున్న మై డియర్‌ సూర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మీ పుట్టిన రోజు సందర్భంగా గెలుచుకోవడం మరింత ప్రత్యేకం. మీకు నా జన్మదిన శుభాకాంక్షలు. మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ప్రశంసలు మీరు అందుకోవాలని కోరుకుంటున్నా’ 68వ నేషనల్‌ ఫిలిం అవార్డు అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu