HomeTelugu Big Storiesచిరంజీవి పేరులో మార్పు.. వైరల్‌

చిరంజీవి పేరులో మార్పు.. వైరల్‌

Chiranjeevi changes his nam

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం.. గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాలు ఉన్నాయి. సోమవారం (జులై 4) ‘గాడ్ ఫాదర్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి పేరు కాకుండా ఆయన పేరులో స్వల్ప మార్పు చేశారు.

సోమవారం విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’ ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌లో చిరంజీవి పేరు ఇంగ్లీషు లెటర్స్‌లో మరో అక్షరం ‘E’ని చేర్చారు. ఈ వీడియోలో స్క్రీన్‌పై చిరంజీవి పేరు పెద్ద అక్షరాలతో కనిపించింది. ఇందులో MEGA STAR CHIRANJEEVIకి బదులుగా MEGA STAR CHIRANJEEEVI అని ఉంది. దీంతో చిరు పేరు మార్చుకున్న విషయం బయటకొచ్చింది. అయితే ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం.. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu