HomeTelugu Trendingషారుక్ ఖాన్ పాటకు చిరంజీవి డ్యాన్స్ వైరల్

షారుక్ ఖాన్ పాటకు చిరంజీవి డ్యాన్స్ వైరల్

chiru steps on Diwali party
రామ్‍చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు దీపావళి సందర్భంగా వారింట్లో పార్టీ ఇచ్చారు. దానికి కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్, నాగార్జున సహా మరికొందరు టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ పార్టీకి హాజరయ్యారు.

ఈ మెగా ఈవెంట్‌ గ్రాండ్‍గా జరిగింది. దీపావళి పార్టీలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ వీడియో బయటికి వచ్చింది. దీపావళి పార్టీలో చిరంజీవి డ్యాన్స్ హైలైట్‍గా నిలిచింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలోని టైటిల్ సాంగ్‍కు చిరంజీవి సూపర్ స్టెప్స్ వేశారు.

చిరంజీవి తన మార్క్ గ్రేస్ స్టెప్‍లతో అదరగొట్టారు. సింగర్ రాజకుమారి పాట పాడుతుండగా మెగాస్టార్ అదిరిపోయే డ్యాన్స్ చేశారు. చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍ అవుతున్నాయి. చిరూ గ్రేస్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవర్‌గ్రీన్ స్టార్ అంటూ సంబరపడుతున్నారు.

దీపావళి పార్టీలో రామ్‍చరణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్ కలిసి ఫొటో దిగారు. ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‍లో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ.  మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్, ఎన్టీఆర్ భార్య ప్రణతి, అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా దీపావళి పార్టీలో జాయిన్ అయ్యారు. దీపావళి పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu