HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌ పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

రామ్‌ చరణ్‌ పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

chiranjeevi emotional tweet
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటున్నాడు. తాజాగా జాతీయ మీడియా నుంచి మరో అరుదైన గౌరవం అందుకున్నాడు రామ్‌ చరణ్‌. వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ఎంటర్టయిన్ మెంట్ రంగంలో ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ ట్రూ లెజెండ్ అవార్డు లభించింది. ఈ గౌరవాన్ని అందుకోవడానికి చరణ్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళాడు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాల్లో అభిమానులు సహా అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో తన కుమారుడి అచీవ్‌మెంట్ పట్ల చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. ‘నాన్నా… ట్రూ లెజెండ్ అవార్డును గెలుచుకున్న నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. ఇలాగే ముందుకు సాగిపోవాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. చరణ్ పిల్లవాడిగా ఉన్నప్పటి ఫొటోను షేర్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu