ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్ చూశారా..?

unమెగాస్టార్ చిరంజీవి చేయబోయే తదుపరి చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు సినిమాపై అధికార ప్రకటన రాలేదు కదా.. అప్పుడే ఫస్ట్ లుక్ ఏంటి.. అనుకుంటున్నారా..? ఇది ఓ మెగాభిమాని అత్యుత్సాహంతో చేసిన ఫస్ట్ లుక్. ఈ ఫ్యాన్ మేడ్ లుక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. భారీతనానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉన్న ఈ లుక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ తో చిత్రబృందానికి సవాల్ విసిరినట్లుగా ఉంది.
 ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్ట్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై చిరు తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇది మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడి కథ, యుద్ధ వ్యూహాలు, వెన్నుపోట్లు, త్రికోణ ప్రేమకథ ఇలా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం చిరు తన లుక్ ను మార్చుకునే పనిలో పడ్డారు.