HomeTelugu Trendingచిరంజీవి, కొరటాల సినిమా రిలీజ్‌ అప్పుడేనట!

చిరంజీవి, కొరటాల సినిమా రిలీజ్‌ అప్పుడేనట!

4 24
మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా ఇది నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కొరటాల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే చెప్పారు. కానీ దసరాకి వాయిదా పడొచ్చనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఈ సినిమాను 5 నెలలలోనే పూర్తి చేస్తానని మాట ఇచ్చినట్టుగానే కొరటాల పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. మే చివరినాటికి షూటింగును పూర్తి చేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కానిచ్చేసి ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయనున్నాడనేది తాజా సమాచారం. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు. కనుక ఆ రోజునే ఈ సినిమాను విడుదల చేయవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu