HomeTelugu Trendingబింబిసార దర్శకుడుతో మెగాస్టార్‌ చిరంజీవి

బింబిసార దర్శకుడుతో మెగాస్టార్‌ చిరంజీవి

chiranjeevi movie with bimb

మెగాస్టార్ చిరంజీవిని వరుస ఫ్లాప్‌లు వెంటడుతున్నాయి. ఇటీవలే ఆయన భోళాశంకర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయంది. అయినప్పటికీ చిరంజీవి జోష్‌ తగ్గలేదు.. ఆయన చేతిలో పలు కొత్త సినిమాలు ఉన్నాయి.

తాజాగా ఆయన బింబిసార దర్శకుడు వశిష్టకు ఓకే చెప్పారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. చిరంజీవికి ఇది 157వ చిత్రం. చిత్రబృందం చిరంజీవిని ఆయన నివాసంలో కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు వశిష్ట పంచుకున్నారు.

మెగా 157 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా మొదలయ్యాయని వెల్లడించారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తెలిపారు. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండడంతో భారీ హంగులకు లోటు ఉండదని అర్థమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu