HomeTelugu Trendingఛలో దర్శకుడితో చిరంజీవి 156 మూవీ ఫిక్స్‌

ఛలో దర్శకుడితో చిరంజీవి 156 మూవీ ఫిక్స్‌

Chiranjeevi new movie annou
మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆచార్య, గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. చిరంజీవి 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఛలో, భీష్మ వంటి హిట్‌ చిత్రాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. డాక్టర్‌ మాధవి రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు కొన్ని రోజుల్లో తెలియనున్నాయి. చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu